దిగ్విజయ్ సింగ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్

Non Bailable Warrant issued against Digvijay Singh in defamation case

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌పై ప్రజా ప్రతినిధుల కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసింది. ఎంఐఎం నాయకుడు హుస్సేన్‌ అన్వర్‌ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణ సందర్భంగా కోర్టు వారంట్‌ ఇచ్చింది. ఎంఐఎంపై 2016లో దిగ్విజయ్‌పై చేసిన వ్యాఖ్యలకు గానూ పరువునష్టం కేసు దాఖలైంది. అయితే, అనారోగ్యం కారణంగా విచారణకు మినహాయింపు ఇవ్వాలని దిగ్విజయ్‌ కోరారు. ఆయన అభ్యర్థనను తోసిపుచ్చిన ప్రజాప్రతినిధుల కోర్టు ఈ మేరకు వారంట్‌ జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 8కి వాయిదా వేసింది.

 


                    Advertise with us !!!