ధరల పెంపుదల పై హీరో సిదార్థ్ నిర్మల సీతారామన్ పై సెటైరికల్ కామెంట్

Actor Siddharth takes a dig at Nirmala Sitharaman over fuel hike

దేశంలో చమురు ధరలకు రెక్కలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉప్పులు, పప్పులు అన్నీ రేట్లు పెరగటంతో సతమతమవుతున్న మధ్య తరగతి కుటుంబాల మీద బండ మోపుతూ కేంద్రం పెట్రోల్ ధరలను భారీగా పెంచింది. లీటర్ పెట్రోల్ ధర రూ.100 పైగా పెరగటంతో సామాన్యులు  ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్ ధరలు తగ్గించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే పెట్రోల్ మంట పై తీవ్ర ఆందోళన లు వ్యక్తం అవుతున్నాయి. నెటిజన్లు మీమ్స్, ఫన్నీ వీడియోలతో బీజేపీ ప్రభుత్వంపై కౌంటర్, కార్టూన్లు వేస్తున్నారు. అయితే సాధారణ నెటిజన్లు స్పందిస్తే పెద్దగా పట్టించుకునే వారు ఉండరు కానీ సెలెబ్రెటీలు స్పందిస్తే మాత్రం వారి ట్వీట్లు, పోస్ట్ లు వైరల్ అవ్వాల్సిందే. ఇక తాజాగా అలాంటిదే జరిగింది. లవ్ బాయ్ ఇమేజ్ ఉన్న సిద్ధార్థ్ పెట్రోల్ మంట పై తన స్టైల్ లో స్పందించాడు. "మామి తరవాత స్థాయికి చేరుకున్నారు. "ఉల్లిపాయలు లేవు, మెమరీ లేదు, ప్రిన్సిపల్స్ లేవు..మామి రాక్స్ " అంటూ ట్వీట్ చేసారు.

దాంతో ప్రస్తుతం సిద్ధార్థ్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో ఉన్నప్పుడు..ప్రతిపక్షం లో ఉన్న నిర్మలా సీతారామన్ అప్పుడు పెట్రోల్ ధరలు పెంచడం పై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కానీ ప్రస్తుతం ఆవిడే ఆర్థిక మంత్రి హోదాలో ఉండగా పెట్రోల్ ధరలు పెంచడంతో అది ఆయిల్ కంపెనీల ఆధీనంలో ఉందని చెప్పటం పై విమర్శలు వస్తున్నాయి. నిర్మలా సీతారామన్ గతం లో చేసిన వ్యాఖ్యలు..ప్రస్తుత వ్యాఖ్యలను జోడించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాకుండా గతంలో పెట్రోల్ పై బాబా రామ్ దేవ్ కామెంట్స్... ప్రస్తుతం పైన వచ్చిన ఓ మీమ్ ను షేర్ చేసి "బాబా రామ్ దేవ్ రాంగ్ రా రేయ్' అంటూ క్యాప్షన్ పెట్టారు. దాంతో సిద్ధార్థ్ పైన కూడా రామ్ దేవ్ అభిమానులు మండిపడుతున్నారు. 

 


                    Advertise with us !!!