దేశంలో కరోనా మళ్లీ విజృంభణ

India reports 14199 new COVID 19 cases with 83 deaths in 24 hours

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. వరుసగా రెండో రోజూ 14 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 14,199 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,05,850కి చేరింది. ఇందులో 1,06,99,410 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో 1,50,055 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.  ఇప్పటి వరకు 9,695 మంది కొత్తగా డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా వల్ల మరో 83 మంది చెందారని వెల్లడించింది. దీంతో 1,56,385 మహమ్మారి వల్ల మరణించారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,11,16,854 మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారని తెలిపింది.

 


                    Advertise with us !!!