కోలుకున్న గంగాధర్ నాదెళ్ళ

Recovered Gangadhar Nadella

ఉత్తర అమెరికా తెలుగు సంఘం మాజీ అధ్యక్షులు గంగాధర్‌ నాదెళ్ల అస్వస్థతకు గురై కోలుకున్నారు. సడన్‌గా ఆయన అస్వస్థతకు గురవడంతో ఆయనను కుటుంబ సభ్యులు వెస్ట్‌ బ్లూంఫీల్డ్‌ హెన్రీ ఫోర్డ్‌ ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించారని ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని తానా నాయకులు తెలిపారు. హాస్పిటల్‌ అన్నిరకాల పరీక్షల చేసిన తరువాత అంతా బాగుందని చెప్పడంతో డిశ్చార్జ్‌  చేశారన్నారు. కాగా తన ఆరోగ్యం విషయంలో వాకబు చేసినవారందరికీ గంగాధర్‌ నాదెళ్ళ ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌ చెన్నూరి వెంకట సుబ్బారావు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.