వ్యాక్సినేషన్ పై కేంద్రం కీలక నిర్ణయం

mission-indradhanush-3-0-from-the-22nd-of-this-month

కరోనా మహమ్మారిని నిలువరించేందుకు మిషన్‍ ఇంద్రధనుష్‍ ద్వారా కేంద్రం అందించే రోగ నిరోధక టీకాలకు దూరమైన చిన్నారులు, గర్భిణులకు తిరిగి వ్యాక్సిన్‍ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీకాలు పొందని చిన్నారులు, గర్భిణులకు రెండు రౌండ్లలో వ్యాక్సిన్లు అందించేందుకు ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‍ ఇంటెన్సిఫైడ్‍ మిషన్‍ ఇంద్రధనుష్‍ (ఐఎంఐ-3.0) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా ముందుగానే గుర్తించిన దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 250 జిల్లాల్లో ఐఎంఐ-3.0 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 22, మార్చి 22వ తేదీల్లో రెండు విడతల్లో టీకాల పంపిణీ జరగనున్నట్లు అధికారులు తెలిపారు.

 


                    Advertise with us !!!