
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ శాన్ఫ్రాన్సిస్కోలోని తన ఇంటిని అమ్మేస్తున్నారు. వారం రోజులుగా ఈ ఇల్లు మార్కెట్లో అమ్మకానికి ఉంచినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక వెల్లడించింది. 7,99,000 డాలర్లకు ఈ అపార్ట్‌మెంట్‌ను అమ్మకానికి పెట్టారు. సిటీలోని సౌతాఫ్ మార్కెట్లో ఓ బిల్డింగ్ టాప్ ఫ్లోర్లో కమలా హ్యారిస్ అపార్ట్మెంట్ ఉంది. దీనిని 2004లో శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా ఉన్న సమయంలో 489000 డాలర్లకు కమలా హ్యారిస్ కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆమె తాత్కాలికంగా వైట్‌హౌజ్ దగ్గరలోని బ్లెయిర్ హౌజ్‌లో ఉంటున్నారు. ఉపాధ్యక్షుల అధికారిక నివాసమైన నంబర్ వన్ అబ్జర్వేటరీ సర్కిల్‌ను రెనొవేట్ చేస్తుండటంతో కమలా.. మరో చోట ఉంటున్నారు.