వ్యాక్సినేషన్ లో భారత్ మరో మైలురాయి...

Vaccinations in India cross 1 crore mark

భారత్‍లో సాగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‍ కార్యక్రమం మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ కోటి మందికి కరోనా వైరస్‍ వ్యాక్సిన్‍ అందించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. కరోనా మహమ్మారిపై పోరులో భారత్‍ కోటి మందికి కొవిడ్‍ వ్యాక్సినేషన్‍ పూర్తిచేసి మరో మైలురాయిని చేరుకుందని అధికారులు తెలిపారు. మరోవైపు భారత్‍ ఇప్పటికే 25 దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయగా మరో 49 కన్‍సైన్‍మెంట్లను పూర్తి చేయనుందని విదేశాంగ మంత్రి ఎన్‍ జైశంకర్‍ తెలిపారు.

 


                    Advertise with us !!!