తానా ఇవిపి పదవికి నిరంజన్‌ శృంగవరపు పోటీ

Niranjan Shringavarapu to Contest for TANA Executive Vice President

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ 2021-23 సంవత్సరానికిగాను ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి పోటీ పడుతున్నట్లు ప్రస్తుత తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ శృంగవరపు ప్రకటించారు. తానా ద్వారా ఎన్నో సంవత్సరాలపాటు కమ్యూనిటీకి సేవలందించానని, తానా కార్యక్రమాల విజయవంతానికి కృషి చేశానని, తానా ఫౌండేషన్‌ ద్వారా కోవిడ్‌ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో వేలాదిమందికి తానా ద్వారా సహాయం అందించానని, ఈ నేపథ్యంలో తానాకు మరింతగా సేవలు చేసేందుకోసం తానా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి పోటీ పడుతున్నట్లు నిరంజన్‌ శృంగవరపు ప్రకటించారు.

 


                    Advertise with us !!!