తానా ఇవిపి పదవికి నరేన్ కొడాలి పోటీ

Naren Kodali to Contest TANA Executive Vice President

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ 2021-23 సంవత్సరానికిగాను ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి పోటీ పడుతున్నట్లు తానా బోర్డ్‌ మాజీ చైర్మన్‌ నరేన్‌ కొడాలి ప్రకటించారు. తానాలో ఎన్నో సంవత్సరాలపాటు వివిధ పదవులను అలంకరించి కమ్యూనిటీకి ఎన్నో సేవలందించానని, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌గా కూడా గెలిపిస్తే కమ్యూనిటీకి మరింతగా సేవ చేస్తానని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపించి తానా ద్వారా జన్మ, కర్మభూముల్లో ప్రభావవంతమైన సేవ చేసే అవకాశం కల్పించాలని ఆయన కోరారు.