తానా ఫౌండేషన్‌ ట్రస్టీ పదవి బరిలో సత్యనారాయణ మన్నె

satyanarayanamanne contesting tana foundation elections

తానా ఎన్నికల ప్రకటన వెలువడిన తరువాత బరిలో దిగే అభ్యర్థులు ఒక్కొక్కరుగా తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తున్నారు. తానా ఫౌండేషన్‌ ట్రస్టీ పదవికి పోటీ చేస్తున్నట్లు తానా నాయకుడు, జిడబ్ల్యుటీసిఎస్‌ మాజీ ప్రెసిడెంట్‌ సత్యనారాయణ మన్నె ప్రకటించారు. గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు కమ్యూనిటీకి జిడబ్ల్యుటీసిఎస్‌  ఎన్నో విధాలుగా సేవలందించిన ఆయన తరువాత తానా నాయకునిగా కమ్యూనిటీకి మరింతగా సేవలందించారు. 2020-21 సంవత్సరానికిగాను తానా బ్యాక్‌ప్యాక్‌ కమిటీ చైర్‌గా ఉన్న సత్యనారాయణ మన్నె ఆ కార్యక్రమ విజయవంతానికి ఎంతో కృషి చేశారు. వాషింగ్టన్‌ డీసీలో జరిగిన తానా 22వ కాన్ఫరెన్స్‌కు హోస్ట్‌ కమిటీ చైర్‌గా కూడా ఆయన వ్యవహరించారు. 2007లో తానా హాస్పిటాలిటీ కమిటీ చైర్‌గా కూడా ఉన్నారు. వివిధ పదవులను చేపట్టిన సత్యనారాయణ మన్నె తానా ఫౌండేషన్‌ ద్వారా కమ్యూనిటీకి సేవలందించేందుకోసం ట్రస్టీ పదవికి పోటీ చేస్తున్నట్లు చెప్పారు.

 


                    Advertise with us !!!