లాస్ ఏంజెల్స్ లో మాయాబజార్ ప్రదర్శన 6న

Surabhi-Mayabazar-Mythological-Drama-Performance-in-Los-Angeles

విశ్వవేదిక లాస్ ఏంజెల్స్ లో సురభి సంస్థ ఈ నెల 6న సాయంత్రం 6 గంటలకు మాయాబజార్‍ పౌరాణిక నాటక ప్రదర్శనఇవ్వనుంది. దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం(టీఏఎస్‍సీ), ఉత్తర అమెరికా తెలుగు సంఘం(ఎన్‍ఏటీఎస్‍) సంయుక్తంగా సమర్పిస్తున్న సురభి డ్రామా థియేటర్‍- సురభి జయానంద్‍ గ్రూప్‍ వారి  మాయాబజార్‍ పౌరాణిక నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా సుప్రసిద్ధ రచయిత, సినీ నటులు తనికెళ్ల భరణి హాజరవుతున్నారు. సురభి సంస్థ 135 సంవత్సరాల ఘనచరిత్ర కలిగిఉంది. 60 కుటుంబాలు రంగస్థల నాటకాలకే తమ జీవితాన్ని అంకితం చేశారు. పౌరాణిక నాటకాలను భావి తరాలకి సజీవంగా అందిస్తున్న తీరు సర్వత్రా ప్రశంసనీయమని నిర్వాహకులు కొనియాడారు.

పౌరాణిక నాటకాల ఆధారంగా జీవిస్తున్న 60 కుటుంబాలకు తమవంతు చేయూతనందించడటానికి చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నానికి అందరు సహకారం అందించి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. మన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని యువతరాలకు పరిచయం చేయడమే కాకుండా, నాటకాలకు తమ జీవితాలను అంకితం చేసి స్టేజ్‍ షోలపై ఆధారపడిన 60 కుటుంబాలకు మద్దతు ఇస్తుందన్నారు. మహమ్మారి సమయంలో పని లభించకపోవడం వల్ల కళాకారులు కష్టాలను ఎదుర్కొంటున్నందున వారికి గతంలో కంటే ఇప్పుడు మన అవసరం ఉందన్నారు. దయచేసి విరాళం ఇవ్వడం ద్వారా మద్దతు తెలపాల్సిందిగా కోరారు. విరాళాలు అందించాలనుకుంటున్నవారు ఈ లింక్‍ ద్వారా అందించవచ్చు.

Click here to Donate https://tinyurl.com/donate-surabhi-artists 

మాయాబజార్‍ పౌరాణిక నాటక ప్రదర్శనను సామాజిక మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చు.

TASC YouTube Channel: youtube.com/c/TASCLive/live

NATS YouTube Channel: www.natsworld.org/youtubelive

TASC Facebook Page: https://www.facebook.com/TASCPage

 

 


                    Advertise with us !!!