కేజీఎఫ్ 2 నైజాం థియేట్రికల్ రైట్స్ రేట్ చూస్తే టాలీవుడ్ స్టార్ హీరోలు కంగు తినాల్సిందే!

Makers Quote Mind Boggling Rate For Nizam Rights Of KGF 2

టాలీవుడ్ స్టార్ హీరోల  సినిమాలకి ధీటుగా కేజీఎఫ్ 2 సినిమా బిజినెస్ సామాన్యంగా లేదుగా భారీ ఫాన్సీ ఆఫర్స్ తో  జరుగుతోందని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. కేజీఎఫ్ 1 తో ప్రపంచ వ్యాప్తంగా క్రేజీ డైరెక్టర్ గా మారాడు ప్రశాంత్ నీల్. యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన కేజీఎఫ్ అన్ని చిత్ర పరిశ్రమల నుంచి ప్రశంసలు అందుకుంది. హీరోగా యష్ కి దర్శకుడిగా ప్రశాంత్ నీల్ కి విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. ఈ క్రమంలో ఇదే కాంబినేషన్ లో కేజీఎఫ్ 2 రూపొందింది. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. రిలీజ్ అయిన గంటల్లోనే కోట్ల వ్యూస్ సాధించింది నెవ్వర్ బిఫోర్ రికార్డులను క్రియేట్ చేసింది.

కాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ డ్రామా కేజీఎఫ్ 2 హక్కులు దక్కించుకోవడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ మూవీ బిజినెస్ కూడా మైండ్ బ్లోయింగ్ గా జరుగుతోందట. ఇప్పటికే పలువురు డిస్ట్రిబ్యూటర్స్ భారీ మొత్తాలతో మేకర్స్ ని సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. కేజీఎఫ్-2 నైజాం థియేట్రికల్ హక్కులకు మేకర్స్ భారీ రేట్ ఫిక్స్ చేశారట. 75 కోట్ల చెబుతున్నట్లు సమాచారం. కాగా నైజాం రైట్స్ దక్కించుకోవడానికి ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు చాలా ట్రై చేస్తున్నాడని తెలిసింది. 

 


                    Advertise with us !!!