22 మందిపై ఎఫ్ఐఆర్ లను నమోదు చేసిన పోలీసులు

farmers-protest-22-fri-filled-and-200-members-arrest

రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా రైతులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. బారికేడ్లను తోసుకొని మరీ... రైతులు పోలీసులపై దాడికి దిగారు. ఈ ఘటనలో చాలా మంది పోలీసులకు గాయాలు కూడా అయ్యాయి. ఢిల్లీలోని వివిధ ఆస్పత్రుల్లో వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ దాడుల విషయంలో 22 ఎఫ్‌ఐఆర్‌లను పోలీసులు నమోదు చేశారు. అంతేకాకుండా రైతు సంఘాల నేతల పేర్లను కూడా అందులో చేర్చారు. రాకేశ్ టికాయత్, యోగేంద్ర యాదవ్, దర్శన్ పాల్, రజిందర్ సింగ్, బూటా సింగ్, జోగిందర్ సింగ్‌తో సహా మరి కొందరిపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరందరూ ఎన్‌ఓసీని ఉల్లంఘించారని పోలీసులు పేర్కొన్నారు.‘‘ఎన్‌ఓసీని రైతు నేతలు ఉల్లంఘించారు. అందుకే వారి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాం.  అందులో రాకేశ్ టికాయత్ పేరు కూడా చేర్చాం.’’ అని పోలీసులు పేర్కొన్నారు.

 


                    Advertise with us !!!