విజయ్ దేవరకొండ 'లైగర్' షూటింగ్ ముంబైలోనే....

Liger shoot to resume shortly in Mumbai

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న సినిమా 'లైగర్'. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ షూటింగ్ విషయమై కీలక నిర్ణయం తీసుకున్నారట పూరి. వచ్చేనెలలో ముంబైలో షూటింగ్ ప్రారంభించబోతున్నారట. గతేడాది కరోనా ఎఫెక్ట్, లాక్‌డౌన్ కారణంగా మూతబడిన సినిమా షూటింగ్స్ తిరిగి ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. షూటింగ్స్ చేసుకునేందుకు అనుమతులు లభించినా కాస్త టైమ్ తీసుకొని తమ తమ సినిమాలను సెట్స్ పైకి తీసుకొస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లైగర్' మూవీ తదుపరి షెడ్యూల్ ప్రారంభించేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారట దర్శకనిర్మాతలు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు పూరి జగన్నాథ్.

రియాలిటీకి దగ్గరగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న పూరి.. షూటింగ్ లొకేషన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారట. అయితే కథ ప్రకారం చిత్రీకరణ మొత్తం ముంబైలో చేయాల్సి ఉంది.. కానీ అక్కడ కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్న చిత్రయూనిట్, హైదరాబాద్‏లోనే ముంబై సెట్ వేసి షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవలి కాలంలో వార్తలు వచ్చాయి.కానీ లేటెస్ట్ సమాచారం మేరకు 'లైగర్' తదుపరి షెడ్యూల్ షూటింగ్ ముంబైలోనే చేయాలని పూరి ఫిక్సయినట్లు తెలిసింది. ఈ మేరకు వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఫిలిం నగర్ టాక్. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. 

 


                    Advertise with us !!!