మల్టీఫెక్స్ , సినిమా హాళ్ల యాజమాన్యానికి శుభ వార్త!! వంద శాతం సీటింగ్ కి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్

Central government allows 100 percent seating in theatres

కరోనా కేసులు తుగ్గుముఖం పట్టడంతో కేంద్రం శుభవార్త అందించింది. కొవిడ్ ఆంక్షలను పూర్తిగా సడలించింది. సినిమా హాళ్లకు, స్విమ్మింగ్ పూల్స్‌కు పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చింది.దేశంలో కొవిడ్-19 కేసులు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ఆంక్షలను దాదాపుగా పూర్తిగా సడలించింది. సినీప్రియులకు, పర్యాటకులకు, వ్యాపారవేత్తలకు గుడ్ న్యూస్ అందించింది. కంటెయిన్‌మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. జనవరి 31తో గతంలో విధించిన నిబంధనలకు గడువు ముగుస్తుండటంతో కేంద్ర హోం శాఖ బుధవారం (జనవరి 27) కొత్త నిబంధనలు విడుదల చేసింది. ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.లేటెస్ట్ గైడ్‌లైన్స్ ప్రకారం.. సినిమా హాళ్లు, థియేటర్లు గరిష్ట సీటింగ్ సామర్థ్యంతో ప్రదర్శనలు కొనసాగించుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు వీటిని 50 శాతం సీటింగ్ కెపాసిటీకి మాత్రమే అనుమతి ఉన్న విషయం తెలిసిందే.

ఫిబ్రవరి 1 నుంచి కరోనా నిబంధనలివే..

✦ స్విమ్మింగ్ పూల్స్‌కు పూర్తి స్థాయి అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటివరకు క్రీడాకారులకు మాత్రమే స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతి ఉండగా.. ఫిబ్రవరి 1 నుంచి ఈత కొలనులను అందరికీ అనుమతిస్తున్నట్లు హోం శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

✦ ఫిబ్రవరి 1 నుంచి ఎగ్జిబిషన్ హాళ్లకు అనుమతి ఇస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే.. కేవలం వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన ఎగ్జిబిషన్లు మాత్రమే నిర్వహించుకోవాలని సూచించారు.

✦ రవాణా సౌకర్యాలపై ఆంక్షలను పూర్తిగ తొలగించింది. రాష్ట్రాలు- రాష్ట్రాలు మధ్య, రాష్ట్రాల్లోని జిల్లాల మధ్య ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు అక్కర్లేదని స్పష్టం చేసింది. ఇ-పర్మిట్, స్పెషల్ పర్మిషన్ లాంటి ప్రత్యేక అనుమతులు అక్కర్లేదని తెలిపింది.

✦ సినిమా హాల్స్, థియేటర్లకు పూర్తి స్థాయి సామర్థ్యానికి అనుమతి ఇచ్చింది.

✦ 65 ఏళ్లకు పైబడిన వారు, ఆనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణిలు, పదేళ్ల లోపు చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

✦ కంటైన్మెంట్ జోన్లలో కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.

సమాచార పౌర సంబంధాల శాఖా  హోంమంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకొని ఈ నిబంధనలను అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  

 


                    Advertise with us !!!