అధికారుల నిర్లక్ష్య ధోరణికి ఇది పరాకాష్ఠ : ఆనం

No Invitation to Republic Day Celebrations

నెల్లూరు జిల్లా అధికారుల తీరుపై వైకాపాకు చెందిన వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గణతంత్ర వేడుకలకు తనను ఆహ్వానించకపోవడంపై ఆయన మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్య ధోరణికి ఇది పరాకాష్ఠ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆనం మీడియాతో మాట్లాడుతూ అధికారుల తీరుపై కోర్టును ఆశ్రయిస్తానని, క్రిమినల్‌ కేసులు పెట్టేందుకూ వెనకాడబోనని హెచ్చరించారు. యంత్రాంగం తీరుపై తాడోపేడో తేల్చుకుంటానని చెప్పారు. వైకాపా ఎమ్మెల్మేగా గెలిచాక అనేక అవమానాలు ఎదుర్కొంటున్నానని ఆనం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్వహించే ఓ అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యేల పాత్ర ప్రహసనంగా మారిందంటే సిగ్గుపడాలా? బాధపడాలా? అనే పరిస్థితి వచ్చిందన్నారు.

 


                    Advertise with us !!!