ఆ యాప్లను ఎలా నిషేధిస్తారు...

China Urges India to Withdraw Ban on TikTok Other Apps

టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం గతంలో విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయంపై చైనా ఆక్రోశం వ్యక్తం చేసింది. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలను ఉల్లంఘించడమేనని తెలిపింది. ఈ చర్యలు చైనా సంస్థల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయని చిందులు తొక్కుతోంది. గతేడాది ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తడంతో చైనా దురాక్రమణకు కళ్లెం వేసేందుకు భారత్‌ కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆ దేశానికి చెందిన టిక్‌టాక్‌ సహా అనేక యాప్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే గతంలో జారీ చేసిన నోటీసులపై ఇచ్చిన వివరణ సరిగా లేకపోవడంత టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై ఇటీవల నిషేధాన్ని కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

ఈ అంశంపై ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి జీ రోంగ్‌ స్పందించారు. జాతీయ భద్రతను సాకుగా చూపుతూ గతేడాది భారత్‌ పదే పదే చైనాకు చెందిన పలు మొబైల్‌ యాప్‌లను నిషేధించిందన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు, మార్కెట్‌ సూత్రాలను ఉల్లంఘించడాన్ని చైనా గట్టిగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. వివక్షతో కూడిన ఈ చర్యలను భారత్‌ సరిచేసుకోవాలని, తద్వారా ద్వైపాక్షిక సహకారానికి ముందు ముందు నష్టం వాటిల్లకుండా చూడాలని కోరుతున్నట్టు చెప్పారు.

 


                    Advertise with us !!!