టీసీఎస్ అరుదైన ఘనత...

TCS is third most valued IT services brand globally

భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ప్రపంచంలోనే మూడవ అత్యంత విలువైన ఐటీ సేవల బ్రాండ్‌గా నిలిచింది. ప్రపంచ ఐటీ దిగ్గజాలు యాక్సెంచర్‌, ఐబీఎంల తర్వాతి స్థానానికి టీసీఎస్‌ ఎగబాకిందని బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఐటీ సేవల 25-2021 నివేదిక తెలిపింది. మరోవైపు టాప్‌ 10 గ్లోబల్‌ ర్యాంకింగ్స్‌లో నాలుగు భారత ఐటీ కంపెనీలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రోలు చోటు దక్కించుకోవడం విశేషం. ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచిన టీసీఎస్‌ 11 శాతం బ్రాండ్‌ వ్యాల్యూను పెంచుకుని 1500 కోట్ల డాలర్లకు ఎగబాకి ఐజీఎంకు చేరువగా నిలిచిందని బ్రాండ్‌ ఫైనాన్స్‌ నివేదిక వెల్లడించింది. కీలక ట్రాన్స్‌ఫర్మేషన్‌ సేవలకు డిమాండ్‌ పెరగడంతో టీసీఎస్‌ రాబడి భారీగా పెరిగిందని, 2020 నాలుగో త్రైమాసంలో 608 కోట్ల డాలర్ల విలువైన ఆర్డర్లు, ఒప్పందాలను రాబట్టిందని పేర్కొంది. ఇక యాక్సెంచర్‌ ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ బ్రాండ్‌ టైటిల్‌ను నిలుపుకుంది.

 


                    Advertise with us !!!