బాలీవుడ్ లోకి డింపుల్ హయతి!

Dimple Hayati looking to make it big in Bollywood

గల్ఫ్‌ చిత్రంలో హీరోయిన్‌గా అలరించింది అందాల తార డింపుల్‌ హయతి. 2019లో వరుణ్‌ తేజ్‌ హీరోగా వచ్చిన గద్దల కొండ గణేశ్‌ చిత్రంలో జర్ర జర్ర అంటూ సాగే మాస్‌ బీట్‌ లో అందాలు ఆరబోసి స్టన్నింగ్‌ డ్యాన్స్‌ తో అదరగొట్టింది. ఈ భామా ప్రస్తుతం రవితేజతో ఖిలాడీ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ బ్యూటీకి సంబంధించిన క్రేజీ న్యూస్‌ ఒకటి ఫిలింనగర్‌ లో చక్కర్లు కొడుతోంది.

డింపుల్‌ హయతి బాలీవుడ్‌ కు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు బీటౌన్‌ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అక్షయ్‌కుమార్‌-ధనుష్‌-సారా అలీఖాన్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న చిత్రం అట్రాంగి రే. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమలో కీలక పాత్ర కోసం మేకర్స్‌ డింపుల్‌ హయతిని సంప్రదించారన్న వార్త ఇప్పుడు టాలీవుడ్‌ లో హాట్‌ టాపిక్‌ గా మారింది. డింపుల్‌ కూడా ఈ ప్రాజెక్టులో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు టాక్‌.

 


                    Advertise with us !!!