
చైనాకు చెందిన ప్రముఖ యాప్ టిక్ టాక్ ఇండియాలో తమ ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడింది. యాప్‌పై భారత ప్రభుత్వం శాశ్వత నిషేధం విధించిన నేపథ్యంలో టిక్‌టాక్ మృతసంస్థ బైట్ డ్యాన్స్.. తమ ఉద్యోగులకు ఓ మెమో జారీ చేసింది. యాప్‌పై నిషేధం కొంతకాలానికే పరిమితమవుతుందని తాము భావించామని, కానీ అలా జరగలేదని ఆ సంస్థ అందులో చెప్పింది. యాప్ ఇక్కడ పని చేయకుండా అందరు ఉద్యోగులను కొనసాగిస్తూ ఉండలేము. ఇండియాలో తిరిగి ఎప్పుడూ యాప్ పునరుద్దరిస్తామో తెలియదు అని బైట్ డ్యాన్స్ ఆ మెమోలో పేర్కొన్నది.