
స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీ చేయనున్నట్లు జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏకగ్రీవాల విషయంలో గత ఘటనల దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. జనసేన, బీజేపీ కలిసి విజయవాడలో నిర్వహించిన ఉమ్మడి సమావేవంలో నాదెండ్ల మాట్లాడుతూ ఏకగ్రీవాల విషయంలో అధికార పార్టీ నాయకులు మాట్లాడిన మాటలపై జనసేన, బీజేపీ ఉమ్మడి నేతలు గవర్నర్ను కలుస్తాం. వైకాపా నాయకులు మాటలు ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నట్లు ఉంది. కనీవినీ ఎరుగని రీతిలో ఏకగ్రీవాలపై పత్రికల్లో ప్రకటనలు వేేయడం ఆశ్చర్యంగా ఉంది. యువతను ప్రోత్సహించేలా కార్యక్రమాలు ఉండాలి. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి అని అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ గతంలో జరిగిన హింసాత్మక ప్రక్రియను ప్రభుత్వం నిలుపుదల చేయాయలి. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా బెదిరించే ధోరణిని అరికట్టాలి అని అన్నారు.