
కరోనా వైరస్‌తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న అమెరికాను ఆదుకునేందుకు ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో విద్య ప్రచారానికి, అందరికి కరోనా వ్యాక్సిన్ సమానంగా పంపిణీ జరిగేలా 150 మిలియన్ డాలర్లు ప్రకటించింది. వీటిలో 100 మిలియన్ డాలర్లు సీడీసీ ఫౌండేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇతర స్వచ్చంద స్థంలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. ప్రజలందరికీ సమానంగా వ్యాక్సిన్ పంపిణి జరిగేందుకు మరో యాబై మిలియన్ ఆలర్లను పెట్టుబడిగా పెట్టాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాదు లాస్ ఏంజిల్స్, శాన్ఫ్రాన్సిస్కో, కిర్క్లాండ్, వాషింగ్టన్ న్యూయార్క్ నగరాలలోని తమ బిల్డింగ్‌లను, పార్కింగ్ లాట్స్, ఓపెన్ స్పెసేస్లో కరోనా వ్యాక్సినేషన్ క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు సుందర్ పిచాయ్.