
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో స్టార్డమ్ తెచ్చుకున్నారు ప్రభాస్. వరుసగా ప్యాన్ ఇండియా చిత్రాలతో దూసుకెళుతున్న ఆయన తాజాగా ఓ రికార్డ్ సాధించారు. ఇన్స్టాగ్రామ్లో 6 మిలియన్ల ఫాలోయర్లను సొంతం చేసుకున్నారు ప్రభాస్. ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాలోకి వెంటరైన తక్కువ సమయంలోనే ప్రభాస్ 60 లక్షల మంది ఫాలోయర్లను సంపాదించుకోవడం విశేషం. ఇక సినిమాల విషయానికొస్తే..ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యారు. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ రిలీజ్కు సిద్ధమవుతోంది.