అమెరికాలో మరోసారి ట్రావెల్ ఆంక్షలు ?

joe-biden-politics-travel-anthony-fauci-coronavirus-pandemic

కోవిడ్‌ కట్టడి చేసే విషయమై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో బ్రెజిల్‌, ఐర్లాండ్‌, యూకేలతో సహా 26 ఇతర యూరోపియన్‌ దేశల నుంచి వచ్చే అమేరికా యేతర పౌరుల ప్రయాణాలపై మరోసారి ఆంక్షలు విధించేందుకు సిద్ధమౌతున్నట్టు అమెరికా వైట్‌ హౌస్‌ అధికారులు వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి వ్యాప్తించిన కరోనా వైరస్‌పై ఆందోళనలు నెలకొనడంతో ఆంక్షల జాబితాలో దక్షిణాఫ్రికాని కూడా చేర్చనున్నట్టు తెలుస్తోంది. అధ్యక్ష స్థానాన్ని వీడే చివరి రోజుల్లో నుంచి ట్రావెల్‌ ఆంక్షలను సడలిస్తున్నట్టు ప్రకటించిన డొనాల్డ్‌ ట్రంప్‌ దేశాలను తిప్పికొట్టిన అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌, తిరిగి ప్రయాణ ఆంక్షలను విధించేందుకు సిద్ధమౌతున్నారు.

 


                    Advertise with us !!!