నిన్న క్రాక్ హిట్టు నేడు పుట్టిన రోజు నెక్స్ట్ మాస్ మూవీ ఖిలాడీ ఫుల్ జోష్ మీదున్న రవితేజ

Khiladi Movie First Glimpse

నిన్న క్రాక్ హిట్టు నేడు పుట్టిన రోజు నెక్స్ట్  మాస్ మూవీ  ఖిలాడీ ఫుల్ జోష్ మీదున్న రవితేజ బర్త్ డే సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ 'ఖిలాడీ' నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో రవితేజ అప్పీయరెన్స్ ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నేడు (జనవరి 26) మాస్ మహారాజ్ రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ 'ఖిలాడీ' నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ రిలీజ్ చేశారు. ఇది వన్ హావర్ లో ఒక మిలియన్ వ్యూస్ దక్కించుకోవడం రికార్డు!  ఇటీవలే క్రాక్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రవితేజ అదే జోష్‌లో ఈ 'ఖిలాడీ' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 'రాక్షసుడు' సినిమాతో బ్లాక్‌బస్టర్‌ సాధించిన దర్శకుడు రమేశ్‌ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతి లాల్‌ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మాణ బాధత్యలు చేపట్టారు. ఇక తాజాగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌లో రవితేజను చాలా పవర్‌ఫుల్ లుక్‌లో చూపించారు. చేతిలో సుత్తి పట్టుకుని కంటైనర్‌ బాక్సుల నడుమ రవితేజ స్టైలీష్‌గా నడుస్తున్న లుక్ చూసి మాస్ మహారాజ్ ఫ్యాన్స్ హుషారెత్తిపోతున్నారు.

 

దేవి శ్రీ ప్రసాద్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వింటుంటే ఈ మూవీలో రవితేజ రోల్ ఏ రేంజ్‌లో ఉండనుందనేది అర్థమవుతోంది. దీంతో విడుదలైన కాసేపట్లోనే ఈ ఖిలాడీ ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.రవితేజ కెరీర్‌లో 67వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన సరసన మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ బాణీలు కడుతున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ భారీ స్పందన తెచ్చుకోవడంతో సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ గ్లింప్స్ కూడా అదే రేంజ్‌లో ఉండటంతో అంచనాలు రెట్టింపయ్యాయి. అతిత్వరలో షూటింగ్ కంప్లీట్ చేసి ఈ వేసవిలో 'ఖిలాడీ'ని థియేటర్స్‌లో దించాలనిచూస్తోంది చిత్రయూనిట్