
కశ్మీర్ పై పాక్ మరోసారి స్పందించింది. విదేశాంగ మంత్రి ఖురేషీ మాట్లాడుతూ... కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి స్పష్టంగా ఉంటే చర్చలకు ఎందుకు జంకుతోందని ప్రశ్నించారు. శాంతియుతంగా చర్చలు జరుపుదామని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రతిపాదనను మోదీ సర్కారు పెడచెవిన పెట్టిందని, అసలు వాటిపై దృష్టి సారించలేదని ఆయన విమర్శించారు. తాము కేవలం శాంతినే కోరుతున్నామని, ఈ విషయాన్ని అనేక అంతర్జాతీయ వేదికల ద్వారా ఇప్పటికే ప్రకటించామని ఆయన అన్నారు. భారత్, పాక్ రెండూ అణు దేశాలేనని, ఈ రెండు దేశాల మధ్య కశ్మీర్ సమస్య నానుతోందని, అందుకే తొందరగా సమస్య పరిష్కారం కావాలని ఖురేషీ అన్నారు.