కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన హైలెవల్ మీట్......

central homeminister amitsha meeting with highlevel officials

రైతుల ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా.మారడంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన హోంశాఖ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు షా సూచించారు. పరిస్థితి ని అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలగాలను మోహరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.మరో వైపు రైతులు చేపట్టిన ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. మింట్ రోడ్డు వద్ద ట్రాక్టర్ బోల్తా పడటంతో రైతు మరణించాడు. అయితే పోలీసుల కాల్పులతోనే రైతు మరణించాడని రైతులు ఆరోపించారు. ఇక... హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో మాత్రం ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.


                    Advertise with us !!!