ఇంటర్నెట్ ను తాత్కాలికంగా నిలిపేసిన సర్కార్...

internet stopped in delhi

కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇచ్చిన రూట్ మ్యాప్ కాకుండా రైతులు ఎర్రకోట వైపు దూసుకెళ్ళడంతో పరిస్థితి మారిపోయింది. ఒక్కసారిగా రణరంగమైంది. దీంతో కేంద్రం. అలర్ట్ అయింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలకు తాత్కాలికంగా నిలిపేసింది. రాత్రి 12 గంటల వరకూ ఇంటర్నెట్, టెలికాం సేవలను నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సింఘు, ఘాజీపూర్, మఖూర్దా, గ్లోయ్ ప్రాంతాల్లో ఇంటర్నెట్  సేవలను నిలిపేసింది.శాంతి భద్రతల ను అదుపులోకి తేవడానికే ఈ నిర్ణయమని పోలీసులు పేర్కొన్నారు. 

మెట్రో సర్వీసుల నిలిపివేత...

రైతుల ఆందోళన నేపథ్యంలో  మెట్రో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలోని మెట్రో రైళ్ళను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. దిల్షన్ గార్డెన్, జిల్ మిల్, మానస సరోవర్ పార్క్,  జామా మసీదుతో పాటు. మిగతా స్టేషన్లను మూసేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

 


                    Advertise with us !!!