ఎర్రకోటపై రైతు జెండా

farmers flag in redfort

దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారిపోయింది. పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. భద్రతా వలయాన్ని ఛేదించుకుంటూ రైతులు. ట్రాక్టర్లతో ఎర్రకోటకు చేరుకున్నారు. ఎర్రకోట బురుజులపైకి ఎక్కి ఫ్లాగ్ పోల్ పై జెండాలు ఎగరేశారు. వారిని నిరోధించేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలు, లాఠీలకు పనిచెప్పారు. అయితే వారికిచ్చిన రూట్ కాకుండా వేరే మార్గంలో రైతులు ఎర్రకోట వద్దకు చేరుకున్నారని పోలీసులు పేర్కొంటున్నారు.

రాజధానిలో యుద్ధ వాతావరణం....

రైతులు చేస్తోన్న ర్యాలీ, నిరసనతో ఆ ప్రాంతం యుద్ధ.వాతావరణంగా మారిపోయింది.. ఓ వైపు వేల సంఖ్యలో రైతుల ఆందోళన,, మరోవైపు వారిని నిలువరించే ప్రయత్నంలో పోలీసులతో ఆ ప్రాంతం రణరంగమైంది. ఇదిలా ఉంటే రైతులకు సాయంత్రం 5 గంటల వరకూ అనుమతి ఉండడంతో పోలీసులూ రైతులకు నచ్చజెప్పే ప్రయత్నంలో ఉన్నారు.