
గాన గాంధర్వుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యానికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు పద్మ విభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది. అయితే బాల సుబ్రమణ్యానికి తమిళనాడు కోటాలో అవార్డును అందించింది. భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ పురస్కారాలను సోమవారం కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాదికి గాను పద్మ విభూషణ్-7 , పద్మభూషణ్-10 , పద్మ శ్రీ-102 ఇలా మొత్తం 119 మంది వివిధ రంగాలకు చెందిన వారు పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. మరో ప్రముఖ గాయిని కే.ఎస్ చిత్రకు ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు అందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు పద్మ విభూషణ్ ప్రకటించారు. కర్ణాటకకు చెందిన డాక్టర్ మొనప్ప హెగ్డేకు, అమెరికాకు చెందిన నరీందర్ సింగ్ కపానీకి, ఢిల్లీకి చెందిన మౌలానా వహీదుద్దీన్ ఖాన్‌కు, బీబీ లాల్‌కు, ఒడిశాకు చెందిన సుదర్శన్ సాహూకు కూడా పద్మ విభూషణ్ ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి రాం విలాస్ పాశ్వాన్, అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్‌కి, మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు, గుజరాత్ బీజేపీ నేత కేశూభాయ్‌కి పద్మభూషణ్ ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం నలుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. తెలంగాణలో ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఏపీకి చెందిన అన్నవరపు రామస్వామికి పద్మశ్రీ ఏపీకికి చెందిన అసవాది ప్రకాశ్‌రావుకు సాహిత్యరంగంలో చేసిన సేవకుగాను పద్మశ్రీ, ఆర్ట్స్ లో ఏపీకి చెందిన నిడుమోలు సుమతికి, అన్నవరపు రామస్వామికి, తెలంగాణకు చెందిన కనకరాజుకు పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది.