
‘చిత్రలహరి’, ‘ప్రతిరోజూ పండగే’. ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ’ప్రస్థానం’ వంటి డిఫరెంట్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు దేవ్ కట్టా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి ‘రిపబ్లిక్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జె.బి.ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ పతాకాలపై ఈ చిత్రాన్ని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేసింది. ‘‘యువరానర్.. ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు.. శాసనాలను అమలు చేసే ప్రభుత్వోద్యోగులు.. న్యాయాన్ని కాపాడే కోర్టులు... ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పులు ఒకరు దిద్దుకుంటూ క్రమబద్దంగా సాగినప్పుడే అది ప్రజాస్వామ్యమవుతుంది. ప్రభుత్వమవుతుంది....అదే అసలైన రిపబ్లిక్.’’ ‘‘యువరానర్.. ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు.. శాసనాలను అమలు చేసే ప్రభుత్వోద్యోగులు.. న్యాయాన్ని కాపాడే కోర్టులు... ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పులు ఒకరు దిద్దుకుంటూ క్రమబద్దంగా సాగినప్పుడే అది ప్రజాస్వామ్యమవుతుంది. ప్రభుత్వమవుతుంది....అదే అసలైన రిపబ్లిక్’’ అంటూ సాయితేజ్ వాయిస్‌లో టైటిల్ అర్థాన్ని చెప్పి మోషన్ పోస్టర్‌ను డిఫరెంట్‌గా డిజైన్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ ‘‘‘రిపబ్లిక్’ అనే పవర్ఫుల్ టైటిల్‌తో సాయితేజ్ హీరోగా దేవ కట్టగారి దర్శకత్వంలో రూపొందుతోన్న మా సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ ఏడాది సమ్మర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. నటీనటులు: సాయితేజ్ ఐశ్వర్యా రాజేశ్ జగపతిబాబు రమ్యకృష్ణ సుబ్బరాజు రాహుల్ రామకృష్ణ బాక్సర్ దిన
సాంకేతిక వర్గం: సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్ మ్యూజిక్: మణిశర్మ ఎడిటర్: కె.ఎల్.ప్రవీణ్ ఆర్ట్: శ్రీకాంత్ రామిశెట్టి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సతీశ్ బీకేఆర్ పాటలు: సుద్దాల అశోక్ తేజ, రెహమాన్ పి.ఆర్.ఓ: వంశీ కాక నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు కథ, మాటలు, దర్శకత్వం: దేవ్ కట్టా స్క్రీన్‌ప్లే: దేవ కట్ట, కిరణ్ జయ్ కుమార్