అమెరికా ఇలా చేయడం మంచిది కాదు

US carrier group enters South China Sea amid Taiwan tensions

దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికా తన విమాన వాహన నౌకలను పంపించడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తన బలం చూపించడానికి అమెరికా తరచూ ఇలా నౌకలు, విమానాలను దక్షిణ చైనా సముద్రంలోకి పంపిస్తోందని, ఇది ఈ ప్రాంతంలో శాంతికి ఏమాత్రం మంచిది కాదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ సృష్టం చేసింది. ప్రతి ఏటా ఈ దక్షిణ చైనా సముద్రం ద్వారా కొన్ని లక్షల కోట్ల డాలర్ల వాణిజ్య సాగుతుంది. దీనిపై సంపూర్ణ హక్కులు తమవే అని చైనా వాదిస్తుండగా.. ఇందులో తమ వాటా కూడా ఉన్నదని వియత్నాం, మలేషియా, ఫిలిప్పీన్స్‌, బ్రూనై, తైవాన్‌ అంటున్నాయి. ఇలాంటి వివాదాస్పద జలాల్లోకి అమెరికా తన విమాన వాహన నౌక అయిన యూఎస్‌ఎస్‌ థియోడర్‌ రూజ్‌వెల్ట్‌తో పాటు మూడు నౌకలను పంపించింది. దక్షిణ చైనా సముద్రంలో తాము ఆక్రమించిన దీవుల దగ్గరికి తరచూ అమెరికాకు చెందిన నేవీ నౌకలు వస్తున్నట్లు చైనా ఆరోపిస్తోంది.

 


                    Advertise with us !!!