ఇండియానాపొలిస్ ‌లో కాల్పుల కలకలం

five-people-unborn-child-killed-in-mass-shooting-in-indianapolis

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఇండియానాపొలిస్‌లోని ఓ ఇంట్లో దుండగుడు కాల్పులకు పాల్పడాడు. దుండగుడి కాల్పుల్లో గర్భిణి సహా ఐదుగురు మృతి చెందారు. కాల్పుల్లో గాయపడ్డ మరో చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు చోటు చేసుకున్నట్లు ఇండియానాపొలిస్‌ పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రక్తపు మడుగులో గాయాలతో పడి ఉన్న ఓ బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ బాలుడు బతికే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటన యాదృచ్ఛికంగా జరగలేదు.. సామూహిక హత్య అని పోలీసులు అభిప్రాయపడ్డారు. కాల్పులు ఎవరు జరిపారు? అసలెందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.