కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి ఎమ్మెల్యే..

Jagtial MLA Dr Sanjay Kumar taken Covid Vaccine

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు దవాఖానల్లో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ప్రైవేట్‌ హాస్పిటళ్ల వైద్యసిబ్బందికి కరోనా టీకా పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ కరోనా టీకా తీసుకున్నారు. బుధ, శనివారాలు మినహా ప్రతి రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుందని అధికారులు ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదువేల ప్రైవేటు దవాఖానల్లో టీకా పంపిణీ చేస్తున్నారు. దీనికోసం 179 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్‌ కోసం ఇప్పటికే 1.54 లక్షల మంది సిబ్బంది కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌లో 59 వేల మంది, అత్యల్పంగా ములుగు జిల్లాలో 53 మంది ఉన్నారు. 50కి పైగా సిబ్బంది ఉన్న ప్రైవేటు హాస్పిటళ్లలో అక్కడే వ్యాక్సినేషన్‌ ఇవ్వనున్నారు. 50కి తక్కువగా సిబ్బంది ఉంటే సమీపంలోని ప్రభుత్వ దవాఖానలో టీకా వేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.

 


                    Advertise with us !!!