అసదుద్దీన్ ఓవైసీపై నాన్ బెయిలబుల్ వారెంట్

Special Court Issues Non Bailable Warrant for Asaduddin Owaisi.

ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీపై జరిగిన దాడి కేసులో కోర్టుకు అసద్‌ హాజరుకాకపోవడంతో ప్రత్యేక కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. 2015లో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ ప్రయాణిస్తున్న కారును కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. అందులో కొంతమంది కారు లోపల కూర్చున్న షబ్బీర్‌ అలీపై దాడి చేశారు. మీర్‌ చౌక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనలో అసదుద్దీన్‌ ఓవైసీని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో అసద్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. అయితే, ఈ దాడిలో తన పాత్ర లేదని గతంలో ఒక ట్వీట్‌ ద్వారా అసదుద్దీన్‌ వెల్లడించారు. తాను దాడి చేసినవారిని అడ్డుకున్నానని పేర్కొన్నారు.

 


                    Advertise with us !!!