అమెరికాలో థర్డ్ పార్టీ లేనట్లే...

Trump adviser says former President not currently considering launching a third party

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ఇటీవల వార్తలు వెలుబడిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్‌ పార్టీ పెట్టడం లేదని గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో క్యాంపేన్‌ అడ్వైజర్‌గా చేసిన జేసన్‌ మిల్లర్‌ సృష్టం చేశారు. పార్టీ పెట్టాలన్న ఆలోచనలను ట్రంప్‌ మార్చుకున్నట్లు ఆయన తెలిపారు. 2022 మధ్యంతర ఎన్నికల్లో హౌజ్‌, సేనేట్‌లో మళ్లీ రిపబ్లికన్‌ పార్టీ ఆధిక్యం కోసం ట్రంప్‌ దృష్టి పెట్టినట్లు మిల్లర్‌ తెలిపారు. శ్వేతసౌధాన్ని వీడే ముందు రోజు ట్రంప్‌ ఓ వీడియో పోస్టు చేసిన విషయం తెలిసిందే. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. అయితే ట్రంప్‌ మూడవ పార్టీ స్థాపించే అవకాశాలు ఉన్నట్లు వదంతలు వ్యాపించాయి. కానీ ఆ వార్తలను జేసన్‌ మిల్లర్‌ కొట్టిపారేశారు. హౌజ్‌, సేనేట్‌లో మళ్లీ రిపబ్లికన్ల ఆధిప్యతం కోసం ట్రంప్‌ పనిచేస్తారని మిల్లర్‌ తెలిపారు.

 


                    Advertise with us !!!