
ఈ ప్రపంచంలో నూటికి 99 శాతం మంది మనుషులు తిండికోసం డబ్బులు సంపాదిస్తారు. కానీ, ఒక్క శాతం ఇందుకు పూర్తి భిన్నం. తింటూ డబ్బులు సంపాదిస్తారు. ఎంతో అదృష్టం ఉంటే గానీ, అలాంటి రుచికరమైన ఉద్యోగం దొరకదు. ఒక వేళ తింటూ డబ్బు సంపాదించే అవకాశం మీకు వస్తే వదులుకుంటారా? లేదు కదా. అయితే వెంటనే కెనడాకు చెందిన క్యాండి ఫన్‌హౌస్ అనే క్యాండీల్ తయారీ కంపెనీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. క్యాండీ, చాక్లెట్ టేస్ట్ టెస్టర్ జాబ్స్‌కు దరాఖాస్తు చేసుకోండి. ఫిబ్రవరి 15వ తేదీన దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది.
ఈ లోపు మీరు మీ దరఖాస్తును పంపించేయండి. సదరు కంపెనీ తాము తయారు చేసే పదార్థాలను రుచి చూస్తే ఉద్యోగుల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. గంటకు 30 కెనడియన్ డాలర్లు (దాదాపు 1700 రూపాయాలు) ఇస్తామంటోంది. ఉద్యోగానికి ఎంపికైన వారు చేయాల్సిందల్లా ఆ కంపెనీ తయారు చేసే 3,000 క్యాండీలు, చాక్లెట్లను రుచి చూసి ఎలా ఉన్నాయో చెప్పాలి.