పాత వంద నోట్ల రద్దుపై కేంద్రం స్పందన

Is RBI Planning to Scrap Old Notes of Rs 100 10 and 5

మార్చి, ఏప్రిల్‌ నాటికి పాత కరెన్సీ నోట్ల రూ.100, రూ.10, రూ.5ను చలామణి నుంచి శాశ్వతంగా తొలగిపోనున్నాయనే వార్తలపై కేంద్రం స్పందించింది. అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని ప్రభుత్వం సృష్టం చేసింది. పాత వంద, పది, ఐదు రూపాల నోట్లు రద్దు ఊహాగానాలను తప్పుడు నివేదికలుగా కొట్టిపారేసిది. మార్చి లేదా ఏప్రిల్‌ నాటికి రూ.100, రూ.10, రూ.5ల పాత సిరీస్‌ కరెన్సీ నోట్లను ఉపసంహరించుకోవాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) యోచిస్తోందని ఇటీవల కొన్ని నివేదికలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీబీఐ) ట్విటర్‌ ద్వారా వివరణ ఇచ్చింది. ఇది ఫేక్‌ న్యూస్‌ అని తేల్చి చెప్పింది. ఆర్‌బీఐ అలాంటి ప్రకటన చేయలేదని ట్వీట్‌ చేశారు. మరోవైపు ఆర్‌బీఐ  ప్రతినిధి కూడా ఈ వార్తలను తోసిపుచ్చారు. ఈ నోట్లను ఉపసంహరించుకునే ఆలోచన ఏదీ లేదని సృష్టం చేశారు.

 


                    Advertise with us !!!