మీడియా దిగ్గజం ల్యారీ కింగ్ ఇక లేరు

Larry King legendary talk show host dies at 87

అమెరికా మీడియా దిగ్గజం ల్యారీ కింగ్‌ (87) కన్నుమూశారు. అర్థ శతాబ్దానికి పైగా ప్రపంచ నేతలు, సినీ రంగ ప్రముఖులు మొదలుకొని సామాన్యుల దాకా ముఖాముఖిలు నిర్వహించి సరికొత్త అధ్యాయం సృష్టించిన టాక్‌ షో లెజెండ్‌ ల్యారీ కింగ్‌. లాస్‌ ఏంజెలిస్‌లోని సెడార్స్‌-సినాయ్‌ మెడికల్‌ సెంటర్‌లో కింగ్‌ కన్నుమూశారని ఆయన సహ వ్యవస్థాపకుడుగా ఉన్న ఓరా మీడియా ట్విట్టర్‌లో తెలిపింది. జనవరి 2వ తేదీన కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని ఆయన కుమారుడు చాన్స్‌ ధ్రువీకరించారు.

1985 నుంచి 2010 వరకు సుదీర్ఘకాలం రేడియో హోస్ట్‌గా ఉన్నారు. 2010 నుంచి సీఎన్‌ఎన్‌లో పనిచేశారు. ఆయన నిర్వహించిన 50 వేలకు పైగా కార్యక్రమాలు రేడియో, టీవీల్లో ప్రసారమయ్యాయి. 1995లో మధ్యప్రాచ్యం శాంతి చర్చలకు ల్యారీకింగ్‌ అధ్యక్షత వహించారు. ఎలిజబెత్‌ టేలర్‌, మిఖాయిల్‌ గోర్బచెవ్‌,  బరాక్‌ ఒబామా, బిల్‌గేట్స్‌, లేడీ గాగా వరకు ఆయన  ఎందరో ప్రముఖులతో మూఖాముఖి నిర్వహించారు. 1933లో యూదుల కుటుంబంలో జన్మించిన ల్యారీ చిన్నతనంలో ఎన్నో కష్టాలు చవిచూశారు.

 


                    Advertise with us !!!