మరో 12 కోట్ల మంది పేదరికంలోకి...

12-crore-people-world-wide-pushed-into-poverty-says-world-bank

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరో 11.9 కోట్ల నుంచి 12.4 కోట్ల మంది నిరు పేదరికంలోకి వెళ్లనున్నారని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. గత అక్టోబర్‌లో 8.8 కోట్ల నుంచి 11.5 కోట్లుగా ఉన్న ఈ అంచనా.. తాజా జనవరి లెక్కల ప్రకారం మరింత పెరిగినట్లు ప్రపంచ బ్యాంక్‌ వెల్లడించింది. 2020లో ప్రపంచ పేదరికం అసాధారణ స్థాయిలో పెరిగిపోయిందని సృష్టం చేసింది. గత 20 ఏళ్లుగా పేదరిక నిర్మూలన కోసం చేసిన కృషి, దాని ఫలితాలపై కరోనా గట్టిదెబ్బే కొట్టిందని ప్రపంచ బ్యాంక్‌ అభిప్రాయపడింది. గడిచిన రెండు దశాబ్దాలలో తొలిసారి మళ్లీ ఇప్పుడే పేదరికం పెరిగిపోయిందని చెప్పింది.  1999 నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మంది నిరు పేదరికం నుంచి బయటపడ్డారని, ఇప్పుడు మరోసారి కరోనా కారణంగా పేదరికం పెరిగిపోతోందని వరల్డ్‌ బ్యాంక్‌ సృష్టం చేసింది.

 


                    Advertise with us !!!