
ధన్యవాదాలు తెలిపిన మహేష్ బిగాల (ఎన్నారై కో-ఆర్డినేటర్)
సామాన్యుడి భూ సమస్యలకు చరమగీతం పాడేందుకే సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే, మహేష్ బిగాల మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ బిడ్డలు అన్ని చోట్ల వున్నారు, ఆధార్ లేకుండా ఇక్కడ ఏదైనా భూములు కొనుగోలు చేసినప్పుడు వాళ్ళు చాల ఇబ్బందిలు ఎదుర్కొంటున్నారు అని అన్నారు.
ఎన్నారైల ఇబ్బందులను మహేష్ బిగాల కవిత గారి సారధ్యములో మిగితా ఎన్నారై బృందాలతో కలిసి తెరాస ప్లినరీ, తెలుగు ప్రపంచ మహాసభల, ధరణి పోర్టల్ లాంచ్ చేసిన పలు మార్లు సీఎం దృష్టికి తీసుకురాగా సీఎం సానుకూలంగా స్పందించి తప్పకుండ ఎన్నారైలకు సరైన సంధర్బములో ఉండేట్టు హామీ ఇచ్చారు. ఈ మధ్య కాలములో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ గారికి పలు మార్లు దృష్టికి తీసుకెళ్లగా ప్రతీక చొరవ తీసుకున్నందుకు దన్యవాదాలు తెలిపారు.
కెసిఆర్ రాష్ట్రంలో భూములున్న ఎన్నారైలకు ప్రభుత్వం తరపున భరోసా ఇచ్చారు. వారి భూముల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేసుకొనేందుకు సదుపాయం కల్పించింది. ‘ఎన్నారై పోర్టల్' పేరుతో ప్రత్యేక ఆప్షన్ శనివారం నుంచి అందుబాటులో కి వచ్చింది. ధరణిలో స్లాట్ రీషెడ్యూల్కు కూడా ఆప్షన్ ఇచ్చింది. ‘తెలంగాణలో భూములున్న వ్యక్తి ప్రపంచంలో ఎక్కడున్నా ప్రశాంతంగా, ధైర్యంగా ఉండాలన్నదే మా లక్ష్యం. ఎన్నారైలకు ఆధార్ కార్డుకు బదులు పాస్‌పోర్ట్ లేదా ఇంకేదైనా గుర్తింపు కార్డును పరిగణనలోకి తీసుకొని ధరణి పోర్టల్‌లో భూవివరాలు ఎక్కించాలని ఆలోచిస్తున్నాం’ గత ఏడాది నూతన రెవెన్యూ చట్టంపై చర్చ సందర్భంగా మండలిలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి. ఈ హామీ ఆచరణలోకి వచ్చింది ఈ సందర్బంగా మహేష్ బిగాల ఎన్నారైల అందరి తరపున సీఎం కెసిఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.