
ప్రతి ఏడాది పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు హల్వా వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్ ఈ ఏడాది కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. పార్లమెంట్ నార్త్ బ్లాక్‌లో హల్వా వేడుకను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్‌తోపాటు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆ శాఖ కార్యదర్శలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సాధారణంగా అయితే హల్వా వేడుక పూర్తి కాగానే బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ సారి బడ్జెట్ పత్రులనుగానీ, ఆర్థిక సర్వే ప్రతులనుగానీ ప్రింట్ చేయడం లేదు. ఆయా ప్రతులను డిజటల్ రూపంలో సభ్యులకు అందజేయనున్నారు. కాగా హల్వా వేడుకలో పాల్గొన్న అధికారులు, మంత్రులు, ఇతర సిబ్బంది అందరూ ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవరకు నార్త్ బ్లాక్‌లోనే ఉండనున్నారు.