గోఎయిర్ రిపబ్లిక్ డే సేల్ బంపర్ ఆఫర్

GoAir Republic Day Freedom Sale offers 1 million tickets starting Rs 859

దేశీయ విమానయాన సంస్థ గోఎయిర్‌ రిపబ్లిక్‌ డే ఆఫర్‌ను ప్రకటించింది. దేశీయ ప్రయాణికుల కోసం సుమారు 10 లక్షల సీట్లను తగ్గింపు అందిస్తోంది. టికెట్‌ ధరను రూ.859 (అన్నీ కలిపి) కే అందిస్తున్నట్లు గోఎయిర్‌ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 మధ్య కాలంలో ప్రయాణించే ప్రయాణికులు జనవరి 22 నుంచి జనవరి 29 మధ్య టికెట్లను బుకింగ్‌ చేసుకున్న వాళ్లకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపింది. ఈ చార్జీలు డైరెక్ట్‌ ఫ్లైట్లలో కేవలం ఒకవైపు ప్రయాణానికి మాత్రమేనని పేర్కొంది. అలాగే టికెట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత 14 రోజుల లోపు ఏమైనా మార్పులు చేసినా చార్జీలు ఏవీ ఉండవనిసంస్థ తెలిపింది.

 


                    Advertise with us !!!