కిలిమంజారో పర్వతమెక్కిన హైదరాబాద్ సీపీ

Telangana IPS officer scales Mt Kilimanjaro

హైదరాబాద్‌ జాయింట్‌  పోలీస్‌ కమిషనర్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ తరుణ్‌ జోషి మరో ఎత్తయిన పర్వతాన్ని ఆధిరోహించారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 8:15 గంటలకు ఆఫ్రికాలోనే ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని భువనగిరి పట్టణానికి చెందిన అన్వితారెడ్డితో కలిసి ఆధిరోహించి.. జాతీయ జెండాను రెపరెపలాడించారు. పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన తరుణ్‌ జోషిని ఈ సందర్భంగా నగర సీపీ అంజనీకుమార్‌ ప్రత్యేకంగా అభినందించారు. 2004 ఐపీఎస్‌ బ్యాచ్‌కి చెందిన తరుణ్‌ జోషీకి మౌంటైన్‌ క్లైంబింగ్‌ అంటే చాలా ఇష్టం.

 


                    Advertise with us !!!