భూక్యా లక్ష్మికి... ప్రధానితో మాట్లాడే చాన్స్

bhukya lakshmi to speak modi on republic day

కష్టం వస్తే అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవడం, వాటిని తీర్చేందుకు తిరిగి కష్టాల్లో కూరుకుపోతున్న గిరిజనుల జీవితాల్లో పొదుపు తో వెలుగులు తెచ్చిన గ్రామైక్య సంఘం అధ్యక్షురాలిగా అరుదైన అవకాశం వచ్చింది. మహబూబాబాద్‌ మండలం గడ్డిగూడేనికి చెందిన గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు భూక్య లక్ష్మికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడే చాన్స్‌ లభించింది. పొదుపుపై ఆమెలో కలిగిన ఆలోచన.. అందరిలోనూ ఆమె కల్పించిన అవగాహన, సాధించిన విజయమే ఆమెకు ఈ అవకాశం దక్కేలా చేసింది. ఈ ఘనత సాధించిన ఆమెకు గ్రామస్తుల నుంచి అభినందనలు వెల్లువెత్తున్నాయి.

 


                    Advertise with us !!!