కేటీఆర్ పట్టాభిషేకానికి ముహుర్తం ఖరారైనట్లేనా?

KTR Set to Replace Father KCR as Telangana CM

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల తారకరామారావు పట్టాభిషేకంకు తేదీ ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి.  ఫిబ్రవరి 18వ తేదీన కేటీఆర్‍ను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి కేసీఆర్‍ ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఫిబ్రవరి 18న ఎందుకు అంటే ఆ రోజు రథసప్తమి. హైందవ సంప్రదాయంలో రథసప్తమికి చాలా ప్రత్యేకత ఉంది. దీన్ని సూర్యజయంతి, వైవస్వత మన్వాది అని కూడా పిలుస్తారు. ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు పుట్టిన రోజుగా దీనికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఆ రోజు చేపట్టే పనులు దిగ్విజయంగా కొనసాగుతాయని నమ్మకం. అలాంటి రోజున కేటీఆర్‍కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయడానికి ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. అధికారిక సమాచారం మాత్రం లేదు.

 


                    Advertise with us !!!