
హైదరాబాద్ గ్రేటర్ కార్పొరేషన్‌కు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు కొత్త కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 11న మధ్యాహ్నం 12:30కు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. ఎన్నిక పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమిస్తారు. ఈ మేరకు ప్రకటన వెలువడింది.