పీవీ చరిత్ర భావితరాలకు అందించాలనేదే సీఎం సంకల్పం

pv-vignana-vedika-work-starts-within-15-days-minister-srinivas-goud

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెలంగాణ బిడ్డకావడం మనకెంతో గర్వకారణమని మంత్రి శ్రీనివాస్గౌడ్అన్నారు. పీవీ చరిత్ర భావితరాలకు అందించాలనేది సీఎం కేసీఆర్సంకల్పమని చెప్పారు. పీవీ స్మృతులు, జ్ఞాపకాలతో ప్రత్యేక మ్యూజియం, థీమ్పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. దేశానికి పీవీ ఎంతో సేవ చేశారని, ఎన్నో సంస్కరణలు తెచ్చారని వెల్లడించారు. రూ.7 కోట్లతో వంగరలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. మరో 15 రోజుల్లో పీవీ విజ్ఞాన వేదికకు భూమిపూజ చేస్తామని వెల్లడించారు. పీవీ స్వగ్రామంలో టూరిజం శాఖ ద్వారా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్‍, ఎంపీ కే కేశవరావు అన్నారు. వంగరలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన జీఓ కాపీని కేకేకు మంత్రి అందించారు.

 


                    Advertise with us !!!