ఆ సాంకేతికతను అభివృద్ధి చేస్తే... రూ.730 కోట్లు ఇస్తా

Elon Musk to give reward of Rs 730 crore

సాంకేతికత పెరిగిన కొద్ది కొత్త సమస్యలు పుట్టకొస్తున్నాయి. అభివృద్ధి మోజులో పడి ముందు ప్రకృతిని పత్టించుకోము. పూడ్చలేని నష్టం వాటిల్లిన తర్వాత కళ్లు తెరిచి పరిష్కారం గురించి ఆలోచిస్తాం. ప్రస్తుతం ప్రపంచ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య కర్భన ఉద్గారాలు. అభివృద్ధి పెరిగిన కొద్ది ఉద్గారాలు ఎక్కువవుతున్నాయి. దాంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు.. అతివృష్టి, అనావృష్టి తలెత్తుతున్నాయి. నేపథ్యంలో ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా అధినేత, బిలియనీర్ఎలన్మాస్క్ నయా సవాల్‌ని తెర మీదకు తెచ్చారు. అంతే కాదండోయ్గెలిచిన వారికి 100 మిలియన్‌డాలర్ల (7,30,05,50,000 రూపాయలు) భారీ ప్రైజ్‌మనీని కూడా ప్రకటించాడు.

ఇంతకు చాలెంజ్ఏంటంటే.. కర్బన ఉద్గారాలను సంగ్రహించే అత్యుత్తమ సాంకేతికతను అభివృద్ధి చేయాలి. వాతావరణ మార్పులను అదుపులోకి ఉంచే అనేక ప్రణాళికలలో భూమిని వేడెక్కించే ఉద్గారాలను సంగ్రహించడం చాలా కీలకమైనదిగా మారుతోంది. కాని రోజు వరకు ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో వెనకబడే ఉన్నాం. గాలి నుంచి కార్బన్‌కు బయటకు తీయడం కంటే ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి సారించాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. నేపథ్యంలో ఎలన్‌మస్క్ తన ట్విట్టర్వేదికగా.. కర్బన్ఉద్గారాలను సంగ్రహించే అత్యుత్తమ సాంకేతికతను అభివృద్ధి చేసిన వారికి 100 మిలియన్‌డాలర్ల ప్రైజ్‌మనీని అందిస్తాను. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వచ్చే వారం ప్రకటిస్తాను అంటూ ట్వీట్‌చేశారు.