టూరిజం అభివృద్ధికి చర్యలు - ఉప్పల శ్రీనివాస్ గుప్త

Development Tourism Meeting at Begumpet in Hyderabad

తెలంగాణ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‍ ఉప్పల శ్రీనివాస్‍ గుప్త అన్నారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరిత హోటళ్ళను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దనున్నట్లు కూడా ఆయన తెలిపారు.  హైదరాబాద్‍ బేగంపేటలో ఉన్న టూరిజం ప్లాజాలో టూరిజం అభివృద్ధి పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హెచ్‍.ఓ.డీలు, యూనిట్‍ మేనేజర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్‍ గుప్త మాట్లాడుతూ, రాష్ట్రంలో టూరిజం డెవలప్‍మెంట్‍కోసం అందరూ అన్ని విధాలుగా కృషి చేయాలని సూచించారు. టూరిస్టులకు అన్ని రకాల వసతులు కల్పించి ఆదాయం పెంచే విధంగా ముందుకు పోవాలన్నారు. హరిత హోటల్స్, బోటింగ్‍, రెస్టారెంట్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో  క్రీడలు, సాంస్కృతికశాఖ కార్యదర్శి శ్రీనివాస రాజ్‍, టిఎస్‍టీడిసి ఎండి మనోహర్‍ రావు, టీఎస్టీడీసీ ప్రాజెక్టస్ ఎగ్జిక్యూటివ్‍ డైరెక్టర్‍ శంకర్‍ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 


                    Advertise with us !!!